![]() |
![]() |

బిగ్ బాస్ చరిత్రలో రెండు సార్లు రన్నరప్ గా నిలిచిన అఖిల్ గురించి అందరికీ తెలుసు. ఐతే రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అవబోతోంది. ఈ టైములో బిగ్ బాస్ కి సంబందించిన ఒక పోస్ట్ ని అఖిల్ పెట్టాడు. ఇప్పుడు అది వైరల్ అవుతోంది. "బిగ్ బాస్ లో రెండు సార్లు వెళ్లి నేను రన్నరప్ గా నిలిచాను. రెండు సార్లు వెళ్లడం అనేది జస్ట్ ఏ నంబర్ మాత్రమే కాదు అది నాలోని సత్తాని, టాలెంట్ ని ఎక్స్పోజ్ చేస్తుంది. నాతో పోటీ పడిన హౌస్ మేట్స్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 అగ్నిపరీక్ష కోసం జడ్జెస్ గా వచ్చారు. వాళ్ళ వలన బిగ్ బాస్ కి ఎక్స్ట్రా వేల్యూ అనేది యాడ్ అయ్యింది. ఒక్కసారి నా టాలెంట్ గురించి ఆలోచించండి...రెండు సార్లు వాళ్ళను ఓడించేలా టాస్కులు ఆడాను. నా గురించి నేను కాదు నా ట్రాక్ రికార్డు చెప్తుంది. నేను షోకి అదనపు ఆకర్షణను తీసుకురాగలననే నమ్మకం నాకుంది. ఐనా కానీ వాళ్ళు బిగ్ బాస్ కి ఏది అవసరమో దాన్ని సరైన పద్దతిలో అందిస్తారని నమ్మకం ఉంది.

నా గురించి మాట్లాడిన ఆ దొంగ రివ్యూవర్ కోసమే నేను ఈ కామెంట్ ని రాస్తున్నాను. మీ మొత్తం బిజినెస్ నా మీద డిపెండ్ అయినట్లే కనిపిస్తోంది. నాపై కాన్సంట్రేషన్ చేయడం మానేసి ఆడియన్స్ కి ఏది అవసరమో ఆ క్వాలిటీ కంటెంట్ ని ఎందుకు అందించలేకపోతున్నావ్ ? ఇలాంటి వన్ సైడెడ్ కంటెంటా మీరు ఆడియన్స్ కి అందిస్తోంది. బిగ్ బాస్ షో స్టార్ట్ కావడానికి ముందే అన్ని విషయాలను లీక్ చేసేయడం వలన ఇక ఆడియన్స్ కి ఎం విలువ ఇస్తున్నట్లు ? షోని షోలా ఉండనివ్వండి. ఆడియన్స్ సస్పెన్స్ ని ఎంజాయ్ చేయాలని అనుకుంటారు కానీ అది మొత్తం ఎందుకు నాశనం చేస్తున్నావ్ ? " అంటూ ఒక ఘాటైన మెసేజ్ ని అఖిల్ సార్థక్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో పెట్టారు.
![]() |
![]() |